మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ లో మెరైన్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత
- April 28, 2025
అమరావతి: మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు చకచకా సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 3 మెరైన్ పీఎస్ లు ఉన్నాయన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఫిషింగ్ హార్బర్లో రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఫిషింగ్ హార్బర్ అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు. ఫిషింగ్ హార్బర్ లో బోట్లు నడవని పరిస్థితి దుస్థితి ఎన్డీయే ప్రభుత్వం వచ్చేదాకా ఉందన్నారు. మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీకి కావల్సిన బోట్ల వంటి సదుపాయాలు సమకూర్చడంపై దృష్టి పెడతామన్నారు.నిరుద్యోగ మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హోంమంత్రి తెలిపారు.పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తర్ఫీదునిచ్చి గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విపత్తునిర్వహణ సంస్థ ద్వారా శిక్షణనిచ్చి ఆపదమిత్రలుగా నియమిస్తామన్నారు. రక్షణలో భాగమైన మెరైన్ పోలీస్ స్టేషన్, ఔట్ పోలీస్ స్టేషన్ ల సామర్థ్యం పెంచుతామన్నారు.
కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఏపీలో నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏపీలోనూ గట్టిగా అమలు చేస్తున్నామని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. భద్రతకు లోటు లేకుండా పటిష్ట తనిఖీలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 21 మంది పాకిస్తాన్ దేశస్తులు మంగళవారంలోగా భారతదేశం విడిచి వెళ్లాలన్న కేంద్రం ఆదేశాలిచ్చామన్నారు.
ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏర్పాటు కలను సాకారం చేస్తామన్నారు. మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్లూ రాక్షస పాలన సాగిందని విమర్శించారు. అమరావతి రాజధాని కోసం మహిళా రైతులు అవమానాలు, బాధలు పడ్డారని ఆమె ప్రస్తావించారు. బూటుకాలుతో తన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా రైతులంతా ఏకమై పోరాడి గెలిచారన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకునే స్వేచ్ఛలేకుండా గత ప్రభుత్వం కక్షగట్టి నానా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం తిరిగి పురుడుపోసుకోవడం రాష్ట్ర ప్రజలకు పండుగలాంటిదన్నారు. ప్రధాని మోదీ సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా భద్రతా ఏర్పాట్లపై మచిలీపట్నం కలెక్టరేట్లో సహచర మంత్రులతో కలిసి హోంమంత్రి సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగిన సమీక్షకు, అంతకుముందు జరిగిన ఫిషింగ్ హార్బర్ పనుల పరిశీలనకు మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ బాలాజీ, కృష్ణాజిల్లాకు చెందిన శాసనసభ్యులు, జిల్లా అధికార యంత్రాంగం హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష
- డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్