యూఏఈ రోడ్డు ప్రమాదంలో 15ఏళ్ళ యువకుడి మృతి
- July 08, 2016
ఎమిరేటీ టీనేజర్ మరో ఇద్దరు ఆసియాకి చెందిన వ్యక్తులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. రస్ అల్ ఖైమాలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 15 ఏళ్ళ వ్యక్తి వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందిందనీ, వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నామని, ప్రమాదంలో వాహనం దగ్ధమై ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. సకాలంలో రెస్క్యూ వాహనాలు ప్రమాద స్థలికి చేరుకున్నా, ప్రమాద తీవ్రత దృష్ట్యా అప్పటికే ఆ యువకుడి ప్రాణం పోయిందని ఆయన వివరించారు. మరో ప్రమాదంలో, ముగ్గురు ఆసియన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వాహనం లోయలోకి పడిపోయింది. ప్రమాద స్థలంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించి వాహనాలు నడపడం ద్వారా మాత్రమే ప్రమాదాలు నివారించవచ్చని బ్రిగేడియర్ హుమైది చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







