అజ్మాన్, షార్జాల్లో ఫేక్ మొబైల్ మార్కెట్స్
- July 08, 2016
అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా షార్జా, అజ్మాన్లో నకిలీ మొబైల్ ఫోన్ల అమ్మకాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి మొబైల్స్ని కొనుగోలు చేస్తున్నవారిలో ఎక్కువమంది వలసదారులే ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో అమ్మకందారులు, వినియోగదారులకు ఫేక్ మొబైల్స్ని అంటగడుతున్నారు. బ్లాక్బెర్రీ ఫోన్లు, ట్యాబ్లెట్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్లు నమ్మశక్యం కాని ధరల్లో, అంటే 50 నుంచి 200 దిర్హామ్లలోపే దొరుకుతున్నాయి. అయితే కొనుగోలు చేశాక వినియోగదారులకి అవి డూప్లికేట్ అని అర్థమవుతోంది. అయినప్పటికీ అవి అచ్చం ఒరిజినల్ని పోలి ఉండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డూప్లికేట్ ఫోన్లలో చాలావరకు చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఎకనమిక్ డిపార్ట్మెంట్ మరియు కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ డూప్లికేట్ మొబైల్ మార్కెట్పై దాడులు నిర్వహిస్తున్నా ఫలితం ఉండటంలేదు. గత ఆరు నెలలుగా నిరంతరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈద్ సందర్భంగా ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నారు. డూప్లికేట్ మార్కెట్ని అడ్డుకునేందుకు ఇంకా సమర్థవంతమైన దాడుల్ని కొనసాగించాల్సి ఉంటుందని, దేశంలోకి అవి ప్రవేశించకుండా అడ్డుకోవడమొక్కటే ఈ మార్కెట్ని అంతమొందించడానికి ఉన్న అవకాశమని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







