పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ..ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..
- April 28, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందజేశారు.వైద్య రంగంలో డాక్టర్ దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్ అందుకున్నారు.
కళా రంగంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో మెరిశారు. మందకృష్ణ మాదిగ, నటుడు అజిత్, ఏపీకి చెందిన కేఎల్ క్రిష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పద్మ పురస్కారాలు అందుకున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది.139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్,113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. అటు కోలీవుడ్ హీరో అజిత్ సైతం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో హీరో అజిత్ సూట్ లో మెరిశారు.
గాయకుడు అర్జిత్ సింగ్- పద్మశ్రీ
నటుడు నందమూరి బాలకృష్ణ- పద్మభూషణ్
గాయకుడు పంకజ్ ఉధాస్ (మరణానంతరం)- పద్మ భూషణ్
నటుడు అజిత్ కుమార్-పద్మ భూషణ్
చిత్ర నిర్మాత శేఖర్ కపూర్-పద్మ భూషణ్
నటుడు అశోక్ లక్ష్మణ్ సరాఫ్- పద్మశ్రీ
యాక్టింగ్ కోచ్, థియేటర్ డైరెక్టర్ బారీ గాడ్‌ఫ్రే జాన్-పద్మశ్రీ
గాయకుడు జస్పిందర్ నరులా- పద్మశ్రీ
గాయకుడు అశ్విని భిడే దేశ్‌పాండే-పద్మశ్రీ
సంగీత స్వరకర్త రికీ జ్ఞాన్ కేజ్-పద్మశ్రీ
జానపద గాయకుడు భేరు సింగ్ చౌహాన్-పద్మశ్రీ
భక్తి గాయకుడు హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే-పద్మశ్రీ
జానపద సంగీత విద్వాంసుడు జోయనాచరణ్ బఠారి-పద్మశ్రీ
క్లాసికల్ సింగర్ కె ఓమనకుట్టి అమ్మ-పద్మశ్రీ
గాయకుడు మహాబీర్ నాయక్ – పద్మశ్రీ
నటి మమతా శంకర్ -పద్మశ్రీ
నటుడు అనంత్ నాగ్- పద్మభూషణ్
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







