లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా NATS మహిళా సంబరాలు

- April 29, 2025 , by Maagulf
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా NATS మహిళా సంబరాలు

లాస్ ఏంజిల్స్: అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా లాస్ ఏంజిల్స్‌లో మహిళా సంబరాలను ఘనంగా నిర్వహిచింది. తెలుగు మహిళల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధంగా నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం లాంగ్ బీచ్‌లోని కాబ్రిల్లో హైస్కూల్‌లో నిర్వహించిన ఈ మహిళా సంబరాలకు మంచి స్పందన లభించింది.దాదాపు వెయ్యి మందికి పై తెలుగు మహిళలు ఈ మహిళా సంబరాల్లో పాలుపంచున్నారు.

ఈ మహిళా సంబరాల్లో ముందుగా ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించి భారతీయ ఐక్యత ప్రదర్శించారు. 

ఆ తర్వాత  భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా ఈ మహిళా సంబరాల్లో  జరిగిన అనేక కార్యక్రమాలు అందరిని అలరించాయి.  ముఖ్యంగా మన తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. మన చీర కట్టు ప్రత్యేకతను ప్యాషన్ షో ద్వారా మహిళలు చూపించారు.  మహిళా సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

మహిళ సంబరాలు మన తెలుగు సమాజం యొక్క శక్తివంతమైన స్ఫూర్తిని, సాంస్కృతిక గొప్పతనాన్ని చాటిందని నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగ నాయకు అన్నారు. లాస్ ఏంజిల్స్‌లో తెలుగు వారి ఐక్యతను ప్రతిబింబించేలా ఈ సంబరాలు జరిగాయని వారు అన్నారు. ఈ మహిళా సంబరాలను విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణలో నాట్స్ ఎప్పుడూ మందుంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. మనం ఎప్పుడూ మన మూలాలను మరిచిపోకూడదనే సందేశాన్ని నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం మహిళా సంబరాల ద్వారా చాటిందని అన్నారు. జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా జరిగే 8వ 
అమెరికా తెలుగు సంబరాలకు లాస్ ఏంజిల్స్‌లో తెలుగు వారంతా రావాలని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. నాట్స్ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, సాంస్కృతిక పరరిక్షణ కోసం ఎంతో కృషి చేస్తుందని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి అన్నారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ అండగా ఉంటుందని తెలిపారు.

నాట్స్ జాతీయ జాతీయ సభ్యులు, లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రముఖ నాయకులు - మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ చిలుకూరి, రాజలక్ష్మి  చిలుకూరి, మనోహర్ మద్దినేని లు చేసిన కృషి అందించిన మద్దతు నాట్స్ మహిళా సంబరాల విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి.

నాట్స్ మహిళా సంబరాలు దిగ్విజయంగా నిర్వహించడంలో నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం కో ఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కో ఆర్డినేటర్ బిందుమాలిని  చేసిన కృషి మరువలేనిది. మహిళా సంబరాల ఆర్గనైజింగ్ టీమ్‌లో శ్రీనివాస మునగాల, రేఖ బండారి, సతీష్ యలవర్తి, లత మునగాల, సుధీర్ కోట, సిద్ధార్థ కోలా, భవ్యత పండ్రంగి, శంకర్ సింగంశెట్టి, అరుణపాల్ రెడ్డి, హరిష్ సింగంశెట్టి, ముకుంద్ పరుచూరి,అరుణ బోయినేని, శ్రీపాల్ రెడ్డి, హరీష్ అండె,  చంద్ర మోహన్ కుంటుమళ్ళ, పద్మజ గుడ్ల, మరియు సరోజా అల్లూరి తదితరులు తమ విలువైన సేవలు అందించి మహిళా సంబరాలు ఘనంగా జరిగేందుకు తోడ్పాడ్డారు. ఈ సంబరాల ప్రణాళిక, అమలు దశల్లో వెంకట్ ఆలపాటి నాయకత్వం, దిశా నిర్ధేశం మహిళా సంబరాల విజయానికి కలిసి వచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com