17వ జాతీయ సైంటిఫిక్ పరిశోధన, ఇన్నోవేషన్ ప్రదర్శన ప్రారంభం..!!
- April 29, 2025
దోహా, ఖతార్: విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఖతార్ ఆధ్వర్యంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ మండలి (QRDI) సహకారంతో నిర్వహిస్తున్న 17వ జాతీయ శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ ప్రదర్శన 2025, ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు జరిగే ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సైంటిఫిక్ పరిశోధన నిపుణులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవంలో MOEHEలోని విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మహా జాయెద్ అల్ రువైలి, QRDI సెక్రటరీ జనరల్ ఇంజనీర్ ఒమర్ అల్ అన్సారీతో పాటు అనేక మంది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వారితోపాటు కౌన్సిల్ ప్రతినిధులు, విద్యార్థి పరిశోధకులు, పర్యవేక్షకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరుస్తాయని , వారి దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే వినూత్న శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించడానికి వారికి అవకాశాలను అందిస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైన్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్ డిజైన్‌లో 104 పరిశోధన ప్రాజెక్టులను ప్రవేశపెడుతుండగా.. మిడిల్ -సెకండరీ పాఠశాల విద్యార్థులు కంప్యూటింగ్, ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రం, శక్తి, బయోమెడిసిన్, పర్యావరణ శాస్త్రాలతో సహా ఎనిమిది అధునాతన శాస్త్రీయ రంగాలలో 150 పరిశోధనా పత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా 33 విధానపరమైన పరిశోధనా పత్రాలతో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







