కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్
- May 01, 2025
తిరుమల: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి పుణ్యక్షేత్రంలో బుధవారం జరిగిన కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు హాజరయ్యారు.
అన్నవరానికి చెందిన దుడ్డు సుబ్రహ్మణ్య గణేష శర్మ కు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సన్యాస దీక్షను అనుగ్రహించి శిష్య స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఉత్తరాధికారిగా నియమితులైన వేదపండితోత్తమ గణేష్ శర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం చేశారు.
ఈ వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్ పీఠాధిపతి, ఉత్తరాధికారులకు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి టీటీడీ చైర్మన్ తో మాట్లాడుతూ తిరుమలతో కంచి పీఠానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ధార్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, టీటీడీ తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా తమ పీఠాన్ని సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం చైర్మన్ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామ కృష్ణ, బొక్కసం ఇన్ ఛార్జ్ గురు రాజ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







