'ఇన్సులేటింగ్ ప్యానెల్స్' కావిటీస్‌లో.. భారీ స్మగ్లింగ్ గుట్టురట్టు..!!

- May 03, 2025 , by Maagulf
\'ఇన్సులేటింగ్ ప్యానెల్స్\' కావిటీస్‌లో.. భారీ స్మగ్లింగ్ గుట్టురట్టు..!!

జెద్దా: జెడ్డా ఇస్లామిక్ పోర్టుకు చేరుకున్న షిప్‌మెంట్‌లో దాచిన 1,586,118 కాప్టాగన్ మాత్రలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA)  ప్రకటించింది. ఇన్‌కమింగ్ షిప్‌మెంట్‌లో “ఇన్సులేటింగ్ ప్యానెల్స్” కావిటీస్‌లో మాత్రలను దాచి తరలిస్తుండగా,  అధునాతన స్కానింగ్ టెక్నాలజీ, క్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి గుర్తించినట్లు అథారిటీ తెలిపింది. అనంతరం ఈకేసులో ప్రమేయమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.   

మాదకద్రవ్యాలు, ఇతర అక్రమ వస్తువుల నుండి సమాజాన్ని రక్షించడానికి GDNCతో సమన్వయంతో సౌదీ అరేబియా దిగుమతులు , ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను కఠినతరం చేసినట్లు అథారిటీ తెలిపింది. అనుమానిత ఉల్లంఘనలను దాని భద్రతా హాట్‌లైన్ (1910), ఇమెయిల్ ([email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా నివేదించి, తమ ప్రయత్నాలకు సహకరించాలని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది. సమాచారం అందించేవారికి వివరాలను గోప్యంగా పెడతామని, ఖచ్చితమైన సమాచారానికి తగిన ఆర్థిక బహుమతిని అందిస్తామని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com