యూఏఈ - ఒమన్ రైలు ప్రాజెక్టు.. పనులు వేగవంతం..!!

- May 03, 2025 , by Maagulf
యూఏఈ - ఒమన్ రైలు ప్రాజెక్టు.. పనులు వేగవంతం..!!

మస్కట్: యూఏఈ-ఒమన్ రైలు నెట్‌వర్క్ ప్రాజెక్టులో పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా భారీ ఎర్త్ మూవర్లు,  ఇతర పరికరాలతో రైల్వే ట్రాక్‌లను వేయడానికి పనులు వేగంతో కొనసాగుతున్నాయని హఫీత్ రైల్ తెలిపింది. ఈ మేరకు పనుల పురోగతిపై ట్వీట్ చేసింది.  

“హఫీత్ రైలు నెట్‌వర్క్ ద్వారా ఒమన్, యూఏఈలను అనుసంధానించే మార్గంలో ప్రతిరోజూ కొత్త పురోగతిని నమోదు చేస్తున్నాము. ప్రాంతీయ కనెక్టివిటీ భవిష్యత్తును మనం వేగంగా నిర్మిస్తున్నాము. ” అని తెలిపింది. హఫీత్ రైలు అనేది ఒమాని-ఎమిరాటి రైల్వే నెట్‌వర్క్ డెవలపర్, ఆపరేటర్ గా సేవలు అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com