వింటర్ క్యాంపులను తొలగించాలి.. MECC

- May 03, 2025 , by Maagulf
వింటర్ క్యాంపులను తొలగించాలి.. MECC

దోహా: 2024-25 వింటర్ సీజన్ ముగిసిందని, వెంటనే క్యాంపులను తొలగించాలని ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MECC) పిలుపునిచ్చింది. ఈ మేరకు అంతర్గత భద్రతా దళాల పర్యావరణ బ్రిగేడ్ (లేఖ్వియా) సహకారంతో దేశంలోని అన్ని వింటర్ క్యాంపుల వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తుంది.   పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలుగా క్యాంపింగ్ సైట్‌ల పరిశుభ్రత, భద్రతను నిర్ధారించడానికి వారి శిబిరాలను తొలగించడం ప్రారంభించమని కోరడం తమ ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వశాఖ తెలిపింది. శిబిరాల తొలగింపును తనిఖీలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com