తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు
- May 05, 2025
హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.మరోవైపు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 45.3, ఆదిలాబాద్-45.2, నిర్మల్-45.2, మంచిర్యాల-45.1, ఆసిఫాబాద్-45, నల్గొండ-44.9, కామారెడ్డి-44.6, కరీంనగర్లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొట్టాయి. ఐఎస్ సదన్‌లో అత్యధికంగా 42, మాదాపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







