ఖరీఫ్ సీజన్ కోసం రోజుకు 12 విమానాలు..ఒమన్ ఎయిర్ సామర్థ్యం పెంపు..!!
- May 07, 2025
మస్కట్: దేశీయ పర్యాటకానికి మద్దతు ఇవ్వడంలో తన నిబద్ధతను బలోపేతం చేస్తూ, రాబోయే ఖరీఫ్ ధోఫర్ కోసం సామర్థ్యంలో పెరుగుదలను ఒమన్ ఎయిర్ ప్రకటించింది. జూలై 1 నుండి ఎయిర్‌లైన్ మస్కట్, సలాలా మధ్య రోజుకు 12 విమానాలను నడుపనుంది. ఈ ప్రత్యేక సమయంలో దక్షిణ ఒమన్ ప్రత్యేకమైన సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అతిథులకు ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ఒమన్ ఎయిర్ మస్కట్-సలాలా మార్గంలో ఈ సంవత్సరం చివరి వరకు 70,000 అదనపు సీట్లను ప్రకటించింది.
అందుబాటులో ధరలలో, సరసమైన దేశీయ ప్రయాణానికి స్థిర జాతీయ ఛార్జీ విస్తరించిన షెడ్యూల్ అంతటా అందుబాటులో ఉంటుందని ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ఒమన్ పౌరులు జూలై 1 - సెప్టెంబర్ 5 మధ్య ఫ్లాట్ OMR 54 వద్ద ప్రయాణ టిక్కెట్ ను ప్రకటించింది. జాతీయ ఛార్జీల సంఖ్యకు పరిమితి లేదని, అయితే అతిథులు తమ ఇష్టపడే ప్రయాణ తేదీలను పొందేందుకు ముందుగానే బుక్ చేసుకోవాలని తెలిపారు. www.omanair.com ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఒమన్ లోపల నుండి బుక్ చేసుకునే వారికి మాత్రమే జాతీయ ఛార్జీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







