దుబాయ్‌లో పెరుగుతున్న ట్రాఫిక్: రద్దీని 30% తగ్గించడానికి ఆర్టీఏ ప్రణాళికలు..!!
- May 07, 2025
యూఏఈ: దుబాయ్‌లోని అధికారులు ఇటీవల ట్రాఫిక్ రద్దీ పెరుగుదల వెనుక ఉన్న ముఖ్య అంశాలను గుర్తించారు. వాటిని తగ్గించడానికి తమ ప్రణాళికలను వెల్లడించారు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం.. “స్థిరమైన, దీర్ఘకాలిక పరిష్కారాలు” ట్రాఫిక్ ప్రవాహాన్ని 20 నుండి 30 శాతం మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.
దుబాయ్‌లో వాహనాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిపిస్తోంది. గత రెండు సంవత్సరాలలో 10 శాతం కాగా, ప్రపంచ సగటు 2 నుండి 4 శాతం మాత్రమే ఉంది. మార్చిలో యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC)లో దీనిపై చర్చ జరిగింది. అక్కడ ఇంధన, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రౌయి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాలు
వాహన మేనేజ్ మెంట్: 2024లో నమోదైన వాహనాల సంఖ్య 2.5 మిలియన్లకు చేరుకుంది. ఈ సంఖ్య యూఏఈ అంతటా నమోదైన అన్ని వాహనాలలో సగానికి సమానం.
పగటిపూట వాహనాల సంఖ్య: దుబాయ్‌లో పగటిపూట వాహనాల సంఖ్య 3.5 మిలియన్లకు చేరుకుందని అధికారిక డేటా చెబుతుంది.
జనాభా పెరుగుదల: దుబాయ్ జనాభా వార్షిక రేటు 6 శాతానికి పైగా పెరుగుతోంది. ఇది ప్రపంచ సగటు 1.1 శాతం కంటే ఎక్కువ. RTA డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయర్ ప్రకారం.. 2040 నాటికి నగరం పగటిపూట జనాభా 8 మిలియన్లకు చేరుకుంటుంది.
వైవిధ్యమైన డ్రైవింగ్ హాబిట్స్: బహుళ సాంస్కృతిక జనాభా, అస్థిరమైన ట్రిప్ ప్లానింగ్, గరిష్ట ప్రయాణ గంటలపై పరిమిత అవగాహన ప్రధాన ట్రాఫిక్ కారిడార్‌లపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
మల్టీ-స్థాయి పరిష్కారాలు
డైనమిక్ టోల్, పార్కింగ్ సుంకాలు: ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన రెండు విధానాల ఫలితంగా ఇప్పటికే ట్రాఫిక్ పరిమాణంలో 9 శాతం వరకు తగ్గుదల, ప్రజా రవాణా ప్రయాణికుల సంఖ్య 4 శాతం పెరిగింది.
3 సంవత్సరాలలో 30 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు: 2027 నాటికి మొత్తం Dh40 బిలియన్ల పెట్టుబడితో 30 కి పైగా రోడ్డు, రవాణా ప్రాజెక్టులను అమలు చేయాలని RTA యోచిస్తోంది. ఇందులో దుబాయ్ మెట్రో బ్లూ లైన్ కూడా ఉంది. ఇది అమలయ్యే ప్రాంతాలలో ట్రాఫిక్‌ను 20 శాతం వరకు తగ్గిస్తుంది.
కీలక సేవల వాణిజ్యీకరణ: ఇది సలిక్, దుబాయ్ టాక్సీ, పార్కిన్, మాడా మీడియా అని నాలుగు కంపెనీలను ఏర్పాటుకు బాటలు వేసింది.
సౌకర్యవంతమైన, రిమోట్ వర్క్ విధానాలు: ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సౌకర్యవంతమైన పని గంటలు, రిమోట్ పని విధానాలను అమలు చేయడానికి RTA ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తోంది. ఇటువంటి విధానాలు ట్రాఫిక్‌ను 30 శాతం తగ్గించడంలో సహాయపడతాయని అథారిటీ తాను నిర్వహించిన రెండు కేస్ స్టడీలను ఫలితాలను బట్టి చెబుతుంది.
భారీ వాహన పరిమితులు: దుబాయ్ ఎమిరేట్స్ రోడ్, ఇతర ప్రధాన మార్గాల్లో ట్రక్ కదలిక పరిమితులను విస్తరించింది.
పాఠశాల జోన్ ఇంప్రూమెంట్: 2024లో పూర్తయిన ఎనిమిది ప్రాజెక్టులు 37 పాఠశాలల చుట్టూ ఉన్న రద్దీని 20 శాతం వరకు తగ్గించాయి.
ప్రత్యేక బస్సు లేన్లు: 2025 - 2027 మధ్య పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిన ఈ లేన్లు కొన్ని మార్గాల్లో ప్రయాణ సమయాన్ని దాదాపు 60 శాతం తగ్గిస్తాయి. షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా స్ట్రీట్, డిసెంబర్ 2వ వీధి, అల్ సత్వా, అల్ నహ్దా, ఒమర్ బిన్ అల్ ఖత్తాబ్, నైఫ్ స్ట్రీట్ అనే ఆరు కీలక రహదారులపై ఇవి 13 కి.మీ. విస్తరించాయి.
కొత్త రోడ్లు
2040 నాటికి 8 మిలియన్ల జనాభా అంచనాలకు తగ్గట్లుగా RTA 11 ప్రధాన రోడ్డు కారిడార్లను మెరుగుపరుస్తోంది.
ఉమ్ సుఖీమ్-అల్ ఖుద్రా కారిడార్: జుమేరా స్ట్రీట్ జంక్షన్ నుండి ఎమిరేట్స్ రోడ్ జంక్షన్ వరకు 16 కి.మీ.ల దూరం విస్తరించి, ప్రయాణ సమయం 46 నిమిషాల నుండి కేవలం 11 నిమిషాలకు తగ్గుతుంది.
హెస్సా స్ట్రీట్: ఇప్పటికే 60 శాతం పూర్తయింది, మెరుగుదలలు ప్రయాణ సమయాన్ని 30 నిమిషాల నుండి ఏడు నిమిషాలకు తగ్గిస్తాయి.
అల్ ఫే స్ట్రీట్: ఈ కారిడార్ అల్ ఖైల్ రోడ్ పొడిగింపుగా పనిచేస్తుంది. ఇది షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ జంక్షన్ నుండి షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ ద్వారా ఎమిరేట్స్ రోడ్ జంక్షన్ వరకు నడుస్తుంది. పూర్తయిన తర్వాత, కారిడార్ గంటకు 64,400 వాహనాలకు అదనపు ట్రాఫిక్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!