కొబ్బరిపాలతో సౌందర్య o
- July 09, 2016
కొబ్బరి పాలతో...
కొబ్బరి.. పోషకాల మయం. దాన్నుంచి తీసేపాలు సౌందర్య సాధనంగానూ ఉపయోగపడతాయి. మీరే చూడండి..
తా జా కొబ్బరిపాలను తలకు పట్టించి మూడు నుంచి ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి. ఆ తర్వాత ఓ ఇరవై నిమిషాలపాటు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల దాకా తగిన తేమా, పోషణా లభిస్తాయి. జుట్టు కుదుళ్లు బలపడతాయి.
*
పొడిబారి నిర్జీవంగా, బలహీనంగా మారిన జుట్టుకి తగిన పోషణ లభించాలంటే కొబ్బరిపాలకు సమాన పరిమాణంలో కొబ్బరి నూనె చేర్చి తలకు పట్టించాలి. అరగంట సేపు ఆరనిచ్చి వేడినీళ్లల్లో ముంచి తీసిన తువాలుని గట్టిగా పిండేసి తలకు చుట్టుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.
*
జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు యాభై మిల్లీ గ్రాముల కొబ్బరిపాలకు వంద మిల్లీ గ్రాముల మంచినీళ్లు, టేబుల్ స్పూను కర్పూరం కలిపి తలకు పట్టిస్తే సమస్య తగ్గుతుంది. చిక్కులు పడిన జుట్టుకి చక్కటి పరిష్కారమూ లభిస్తుంది. ఇది కండిషనర్‌గానూ చక్కగా ఉపయోగపడుతుంది.
*
పొడిబారిన చర్మానికి కొబ్బరిపాలతో స్నానం చక్కటి పరిష్కారం! అన్ని కొబ్బరి పాలా.. అనుకుంటున్నారా? అలాకాదు. మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు గులాబీ రేకలు, పావుకప్పు రోజ్‌వాటర్, కప్పు కొబ్బరిపాలు వేస్తే చాలు. ఆ నీటితో చక్కగా స్నానం చేస్తే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. కొబ్బరిపాలల్లో లభించే విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంసకృత్తులు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
*
ఈ పాలు యాంటీఏజింగ్ కారకాలు కూడా. ఇవి చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. ముడతలూ, గీతలూ తగ్గుతాయి. అంతేకాదండోయ్.. కొబ్బరిపాలతో మేకప్‌ను చక్కగా తొలగించుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







