తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం

- May 13, 2025 , by Maagulf
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది,టీటీడీ యువత కోసం గోవింద కోటి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి, సనాతన ధర్మం పై ఆసక్తి కలిగించడానికి రెండేళ్ల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రామకోటి తరహాలోనే ఈ గోవింద కోటి కార్యక్రమం కూడా ఉంటుంది. గోవింద కోటి రాసిన యువతకు టీటీడీ వీఐపీ దర్శనం కల్పిస్తోంది. 25 ఏళ్లలోపు వయసున్నవారు 10,01,116 సార్లు గోవింద నామం రాస్తే వారికి ఈ అవకాశం దక్కుతుంది. కోటిసార్లు రాస్తే రాసిన వారితో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది.టీటీడీ గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది,టీటీడీ సమాచార కేంద్రాల్లో, పుస్తకాల షాపుల్లో, ఆన్‌లైన్‌లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి. ఒక పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి.ఒక్కో పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు. ఇలా 10,01,116 నామాలు రాయాలంటే దాదాపు 26 పుస్తకాలు కావాలి. కోటి నామాలు రాయడానికి కనీసం మూడేళ్లు పడుతుందని టీటీడీ అంచనా వేసింది. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత తిరుమలలోని టీటీడీ పేష్కార్, కార్యాలయంలో అందజేయాలి. అప్పుడు వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామని పేష్కార్ రామకృష్ణ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com