అబుదాబిలో 5 రెస్టారెంట్లు మూసివేత..సూపర్ మార్కెట్ సీజ్..!!
- May 14, 2025
యూఏఈ: అబుదాబిలో ఐదు రెస్టారెంట్లు సహా ఒక సూపర్ మార్కెట్ ను అధికారులు సీజ్ చేశారు. మూసివేయబడిన వాటిల్లో పాక్ రవి రెస్టారెంట్, లాహోర్ గార్డెన్ గ్రిల్ రెస్టారెంట్, కెఫెటేరియా, కరాక్ ఫ్యూచర్ కెఫెటేరియా, రిచ్ అండ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్, సాల్టీ దేశీ దర్బార్ రెస్టారెంట్, అల్ మకామ్ కార్నర్ రెస్టారెంట్ ఉన్నాయి.
ఆహార భద్రత, వినియోగదారుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అధిక-ప్రమాదకర వస్తువుల పునరావృత సందర్భాలు ద్వారా సంస్థలు ఆహార భద్రతా అవసరాలను ఉల్లంఘించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నివాసితుల ఆరోగ్యం, భద్రతను ప్రమాదంలో పడేసే నేరాలకు ఎమిరేట్‌లోని అధికారులు కఠినంగా వ్యవహారించనున్నారు. సంస్థలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఎమిరేట్ అంతటా తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదే క్రమంలో బెంగాలీ ఆహారాన్ని అందించే రెస్టారెంట్‌ను ఆహార భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు, ప్రజారోగ్యానికి ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నందుకు అధికారులు మూసివేయించారు. అబుదాబిలోని హమ్దాన్ బిన్ మొహమ్మద్ స్ట్రీట్‌లో ఉన్న రూపషి బంగ్లా రెస్టారెంట్ LLCని తనిఖీ అధికారులు పరిపాలనా నోటీసు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..