చెత్త సంక్షోభం నివారించేందుకు కొత్త సంస్థ 20 గంటలపాటు పని అమలు

- July 10, 2016 , by Maagulf
చెత్త సంక్షోభం నివారించేందుకు  కొత్త సంస్థ 20 గంటలపాటు పని అమలు

కొత్త స్పానిష్ కంపెనీ వ్యర్థ సంక్షోభాలని అధిగమించి  రోజుకు 20 గంటలూ శుభ్రపర్చేందుకు  కేటాయించిన  పని  చేయడం ద్వారా అత్యవసర ప్రణాళికని పాటిస్తున్నట్లు తెలిపారు.జూలై 1va తేదీ నుంచి తాము  కార్యకలాపములు ప్రారంభించిన నాటి నుండి కంపెనీ పలు సవాళ్లు ఎదుర్కొన్నట్లు ర్బజర్  సీఈఓ లూయిస్ ఢిల్క్యాంపా తెలిపారు, గతంలో ఇక్కడ పని చేసిన  సింహిక  కంపెనీ దక్షిణ మరియు ఉత్తర గవర్నరేట్ల వారితో సహకరించింది లేదని పేర్కొన్నారు. వారు ఒప్పంద చివరి మూడు రోజుల్లో చెత్త తొలగించలేదని, పూర్తిగా నిండిపోయిన పరిస్థితులలో చెత్త ని  రవాణా చేయడం వలన చెత్త కుండీలు  పల్టీలు కొట్టేవని పేర్కొన్నారు. .రంజాన్ పవిత్ర నెల యొక్క చివరి 10 రోజులు, పరిస్థితి  మరింత అధ్వాన్నంగా మారిందని  వివరించారు. అంతేకాక  ఉద్యోగులు వారి  వారి విధులు ముగించుకొని  ఇఫ్తార్ భోజనంకు వచ్చి  జరిగింది పరిమాణాత్మక చెత్త పేరుకుపోయి ఉండేదని అధికారులు సైతం గమనించడం జరిగిందని తెలిపారు.

"సంస్థకు మరో  ప్రధాన సమస్యలలో ఇంకోక సమస్య ఏమిటంటే , వేసవి కల  పని నిషేధం చట్టం. బహరేన్ జూలై మరియు ఆగస్టు అంతటా ఇది అమలవుతుంది. మధ్యాహ్నం  12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులతో పని చేయించడం అక్రమ చర్యగా ప్రభుత్వం భావిస్తుందని  "ఢిల్క్యాంపా  చెప్పారు. సంస్థ దీనిని అధిగమించేందుకు కార్మికులతో  ఓవర్ టైం  పని చేయించడమే కాక 77 శుభ్రపరిచే వాహనాల నుంచి 120 ట్రక్కుల  సంఖ్యని పెంచేరని  మొత్తం పరికరాల సంఖ్య పెంచినట్లు  తెలిపారు.శుబ్రపరిచే కార్మికుల సంఖ్యను  1,170 నుండి 1,370 కు పెంచినట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com