స్పెయిన్ లో 'మిస్టర్' తొలి షెడ్యూల్

- July 10, 2016 , by Maagulf
స్పెయిన్ లో 'మిస్టర్' తొలి షెడ్యూల్

'ముకుంద' చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మెగా వారసుడు వరుణ్‌తేజ్‌. 'కంచె', 'లోఫర్‌' చిత్రాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వరుణ్‌ తేజ్‌ ఇప్పుడు 'మిస్టర్‌'గా ముందుకు రానున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ స్పెయిన్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్‌ ట్విట్టర్‌లో తెలియజేస్తూ వర్క్‌ మూడ్‌ ఆన్‌.. అంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు వరుణ్‌ తేజ్‌ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌, ఠాగూర్‌ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com