SR20,000 జరిమానా..10 సంవత్సరాల నిషేధం: సౌదీ అరేబియా వార్నింగ్..!!

- May 16, 2025 , by Maagulf
SR20,000 జరిమానా..10 సంవత్సరాల నిషేధం: సౌదీ అరేబియా వార్నింగ్..!!

మక్కా: అధికారిక హజ్ వీసా మినహా, అన్ని రకాల విజిటింగ్ వీసాలు వాటి హోల్డర్లకు హజ్ చేయడానికి అనమతి లేదని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దుల్-ఖిదా మొదటి రోజు నుండి దుల్-హిజ్జా 14వ రోజు ముగింపు వరకు విజిట్ వీసాలను ఉపయోగించి మక్కా లేదా పవిత్ర స్థలాలలోకి ప్రవేశించడానికి లేదా ఉండటానికి ప్రయత్నించే వారికి SR20,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.

తగిన అనుమతులు లేకుండా హజ్ చేయడానికి ప్రయత్నించే నివాసితులు సహా అన్ని ఉల్లంఘనదారులను వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని, తిరిగి 10 సంవత్సరాల పాటు ప్రవేశించకుండా నిషేధిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హజ్ నిబంధనలు, సూచనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో (911) లేదా అన్ని ఇతర ప్రాంతాలలో (999) కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com