మే 19న శ్రీవారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
- May 16, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
22న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
23న అంగప్రదక్షిణం టోకెన్లు….
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
29న శ్రీవారి సేవా కోటా విడుదల
శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.inవెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తాజా వార్తలు
- హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- QR16.68 బిలియన్ల విలువైన 55 మిలియన్లకు పైగా లావాదేవీలు..!!
- 'కువైట్ వీసా' ప్లాట్‌ఫామ్..భారీగా విజిట్ వీసాలు జారీ..!!
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు