మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త–ఏపీ‌లో 250 కొత్త ఎంబీబీఎస్‌ సీట్లు

- October 17, 2025 , by Maagulf
మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త–ఏపీ‌లో 250 కొత్త ఎంబీబీఎస్‌ సీట్లు

2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(AP) ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను పెంచుకునేందుకు జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission – NMC) అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా దాదాపు 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు (AP)పెరిగాయి. ఈ పెరిగిన సీట్లను త్వరలో రాబోయే మూడో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.

సీట్లు పెరిగిన కళాశాలలు:
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  • పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాల: సీట్ల సంఖ్య 100 నుంచి 150కి పెరిగింది (50 సీట్ల పెంపు).
  • కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాల: ఇప్పటికే 200కు పెరిగిన సీట్లను తాజాగా మరో 50 సీట్లు పెంచి 250కి అనుమతులు లభించాయి.
  • విశాఖపట్నం ఎన్నారై మెడికల్ కాలేజీ: ఇక్కడ ఇప్పటికే ఉన్న 150 సీట్లను ఏకంగా 250కి పెంచుతూ అనుమతులు వచ్చాయి (100 సీట్ల పెంపు).

పెరిగిన ఈ సీట్లకు సంబంధించిన లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) త్వరలో రావాల్సి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com