'కువైట్ వీసా' ప్లాట్‌ఫామ్..భారీగా విజిట్ వీసాలు జారీ..!!
- October 18, 2025
కువైట్: గత జూలైలో ప్రారంభించినప్పటి నుండి కువైట్‌లోని ఆరు గవర్నరేట్లలో “కువైట్ వీసా” ప్లాట్‌ఫామ్ విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటివరకు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా మొత్తం 2లక్షల 35 వేల విజిట్ వీసాలు జారీ చేసినట్లు అథారిటీ వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రస్తుతం రోజుకు సుమారు ఆరు వేల వరకు విజిట్ వీసాలను ఆమోదిస్తుందని తెలిపింది.
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి, సందర్శకులు పర్యాటక, వ్యాపారం లేదా కుటుంబ వీసాలను సులభంగా పొందేందుకు వీలుగా ప్లాట్ ఫామ్ ను రూపొందించినట్లు పేర్కొంది. అయితే, విజిట్ వీసాలను దుర్వినియోగం చేయవద్దని ప్రవాసులను హెచ్చరించింది. చట్టవిరుద్ధంగా కువైట్ లో పనిచేస్తూ దొరికితే వారి స్పాన్సర్‌తో పాటు వారిని దేశం నుండి బహిష్కరిస్తామని , వారిని తిరిగి దేశంలోకి రాకుండా నిషేధిస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు
- హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!