మెడికవర్ హాస్పిటల్‌ లో విజయవంతంగా అరుదైన బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ శస్త్రచికిత్స

- May 16, 2025 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్‌ లో  విజయవంతంగా అరుదైన బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ శస్త్రచికిత్స

హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ లోని నిపుణుల బృందం అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఒక 7 ఏళ్ల విదేశీ చిన్నారి ఖాజా (పేరు మార్చబడింది) జీవితాన్ని రక్షించింది.

 గతంలో అనేక ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రయత్నించినా, ట్యూమర్ స్థానం సంక్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స సాధ్యపడదని నిరాకరించారు.

 ఈ చిన్నారి మెదడు స్టెమ్ ప్రాంతంలో అరుదైన మరియు ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు గుర్తించబడింది. మెదడు స్టెమ్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం, అక్కడ చేసిన తక్కువ పొరపాటుకూడా తీవ్ర న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది.

ఈ క్లిష్టమైన కేసును డా.శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో & స్పైన్ సర్జన్ స్వీకరించి, అత్యాధునిక సాంకేతిక పరికరాలతో సహా (ఇన్‌ట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, న్యూరో మైక్రోస్కోప్, సుశక్తమైన CUSA 10 NM పరికరం) అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ట్యూమర్ పూర్తిగా తొలగించబడింది మరియు చిన్నారికి ఎటువంటి న్యూరాలాజికల్ సమస్యలు ఎదురవలేదు.

అంతేకాకుండా, శస్త్రచికిత్స తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పిల్లల ఐసీయూ (PICU) కీలక భూమిక పోషించింది. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడేందుకు మైక్రో లెవెల్ మానిటరింగ్, వెంటిలేటరీ మద్దతు మరియు న్యూరో ప్రొటెక్షన్ పద్ధతులతో చికిత్సను కొనసాగించారు.

"బ్రెయిన్ సర్జరీ తరువాత పిల్లల చికిత్స చాలా సున్నితమైనది. ప్రతి నిమిషం ప్రతి పరిణామాన్ని సమీక్షిస్తూ మేము చికిత్సను ముందుకు తీసుకువచ్చాము," అని చెప్పారు డా. జనార్దన్ రెడ్డి, హెచ్.ఓ.డి, పీడియాట్రిక్ ఐసీయూ.

"బహుళ విభాగాల సమన్వయం, ప్రత్యేకమైన పీడియాట్రిక్ ఐసీయూ వాతావరణం ఖాజా త్వరితంగా కోలుకోవడంలో కీలకంగా మారింది", అని ఆయన అన్నారు.

ఈ విజయాన్ని గురించి డా. రవీందర్ రెడ్డి పరిగి, హెచ్.ఓ.డి, పిల్లల విభాగం మాట్లాడుతూ, “పిల్లల వైద్యంలో మేము కేవలం శస్త్రచికిత్స మాత్రమే కాకుండా, వారి మనోభావాలకు భరోసా కలిగించే విధంగా ఓ శ్రద్ధ గల చికిత్సా వాతావరణం కల్పిస్తాం. ఖాజా కేసు మా టీమ్ యొక్క సమిష్టి నైపుణ్యానికి ఉదాహరణ” అన్నారు.

శస్త్రచికిత్స అనంతరం ట్యూమర్‌ లొ-గ్రేడ్ గా నిర్ధారించబడింది. ప్రస్తుతం ఖాజా రేడియేషన్ చికిత్స పొందుతూ త్వరితంగా కోలుకుంటున్నారు.

ఈ అరుదైన విజయకథ మెడికోవర్ హాస్పిటల్స్‌ను అత్యాధునిక న్యూరోసర్జరీ, పిల్లల వైద్యంలో నిపుణులుగా నిలిపింది. అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం సమన్వయంతో పునర్జీవితం పొందిన ఈ చిన్నారి కథ, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com