షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించిన ట్రంప్..!!

- May 17, 2025 , by Maagulf
షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించిన ట్రంప్..!!

అబుదాబి: మే 15, 16 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..యూఏఈ పర్యటన యూఏఈ-యుఎస్ సంబంధాల బలోపేతంతోపాటు ఎమిరేట్స్ సాంస్కృతిక, మతపరమైన, దౌత్యపరమైన మైలురాళ్లను సందర్శించారు.అబుదాబిలోని రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గురువారం అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును పర్యటించారు. అద్భుతమైన నిర్మాణ కళాఖండం, ఇస్లామిక్ వారసత్వ చిహ్నమైన ఈ మసీదును అధ్యక్ష ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సందర్శించారు.అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కలిసి ట్రంప్..యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సమాధి వద్ద ఘన నివాళులర్పించారు.                                                                                                                                           అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..యూఏఈలో తన చారిత్రాత్మక పర్యటన సందర్భంగా అబుదాబిలోని "ప్యాలెస్ ఆఫ్ ది నేషన్" అయిన కస్ర్ అల్ వతన్ వద్ద స్వాగతం పలికారు.షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వ్యక్తిగతంగా అమెరికన్ అధ్యక్షుడిని తీసుకెళ్లగా..అమెరికన్ , ఎమిరాటి జెండాలను ఊపుతూ పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ట్రంప్ “నక్షత్రాల ద్వారా గైడెడ్” ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.యూఏఈ అంతరిక్ష పరిశోధన ప్రయాణం, దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ దార్శనికతను తెలియజేశారు.డొనాల్డ్ ట్రంప్ తన చారిత్రాత్మక యూఏఈ పర్యటనను అబుదాబిలోని అబ్రహమిక్ ఫ్యామిలీ హౌస్‌ సందర్శనతో ముగించారు.ఇది మత సహనం, సహజీవనం స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన ఇంటర్‌ఫెయిత్ కాంప్లెక్స్ గా గుర్తింపు పొందింది. ఎమినెన్స్ అహ్మద్ ఎల్-తాయెబ్ మసీదు, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి,మోసెస్ బెన్ మైమోన్ సినగోగ్‌లను ఒకే క్యాంపస్ కింద ఉన్న అద్భుతమైన సందర్శనీయ స్థలంగా ఖ్యాతీ గడించింది.ఈ కాంప్లెక్స్ జుడాయిజం, క్రైస్తవ మతం, ఇస్లాం ప్రత్యేక సంప్రదాయాలను జరుపుకుంటూ మానవత్వం విలువలను సందర్శకులకు అందజేస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com