తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- May 18, 2025
తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది.
నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు.
కాగా, ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఓటీటీల ద్వారా సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోతున్నారంటూ సినీ రంగానికి చెందిన వారు బహిరంగంగానే చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడంతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మే 30న భైరవం, జూన్ 5 ధగ్ లైఫ్, జూన్ 12న హరిహర వీరమల్లు, జూన్ 27న కన్నప్ప, జూన్ 20న కుబేర్, జులైలో కింగ్ డమ్ విడుదల కావాల్సి ఉంది. దీంతో వీటిపై ప్రభావం పడుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే నష్టాల్లో ఉన్నాయి. హిట్ సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడుతున్న వేళ మాత్రమే ఆ సినిమా హాళ్లకు కాస్తయినా లాభం వస్తుంది. ప్లాప్ సినిమాలు ఆడుతుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లవైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేక షోలను రద్దు చేసుకుంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు లాభాలు వచ్చే చర్యలు తీసుకోకపోతే ఇక అవి శాశ్వతంగా మూతపడతాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానం చేశారు.
ఒకప్పుడు సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లే దిక్కు. ఈ థియేటర్లు తెలుగు సినిమా ఎదిగిన తీరుకి సాక్ష్యాలుగా నిలిచాయి. మెరుగైన సౌకర్యాలు, సౌండ్ టెక్నాలజీతో వచ్చిన మల్టీప్లెక్స్ సంఖ్య పెరగడంతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆదాయం తగ్గిపోయి, నిర్వహణ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయన్న వివరాలు అంతగా స్పష్టంగా లేవు. తెలంగాణలో 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,600 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నట్లు అంచనా. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 2,809 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఫంక్షన్ హాల్స్‌గా మారిపోయాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







