విహారంలో ప్రమాదం..13 మందిని రక్షించిన యూఏఈ నేషనల్ గార్డ్..!!
- May 19, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర తీరంలో మునిగిపోతున్నఓ పిక్నిక్ బోట్ నుండి యూఏఈ నేషనల్ గార్డ్ టీమ్ 13 మందిని రక్షించింది. బోట్ ప్రమాదంలో ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, సకాలంలో బాధితులను రెస్క్యూ చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా బాధితులను సురక్షితంగా రక్షించేందుక ప్రత్యేక బోట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు, యేఈ ప్రాంతీయ జలాల్లో ఒక కార్గో నౌక మునిగిపోయిన సంఘటనలో ముగ్గురు ఆసియన్లను రక్షించడానికి నేషనల్ గార్డ్ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది. అలాగే గతవారం ఒక కార్గో నౌకలో కాలిన గాయాలతో బాధపడుతున్న 50 ఏళ్ల భారతీయుడిని అబుదాబిలోని షేక్ షాఖ్‌బౌట్ మెడికల్ సిటీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!