కువైట్ లో జూన్ 1 నుండి ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు..!!

- May 19, 2025 , by Maagulf
కువైట్ లో జూన్ 1 నుండి ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు..!!

కువైట్: జూన్ 1 నుండి ఔట్ డోర్ వర్క్ పై కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఆంక్షలు విధించింది. ఆగస్టు చివరి వరకు ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు బహిరంగంగా కార్మికులు పనిచేయడాన్ని నిషేధించారు. అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్ నంబర్ 535/2015 ప్రకారం.. అధిక ఉష్ణోగ్రతల నమోదవుతున్న నేపథ్యంలో డైరెక్ట్ సన్ నుండి కార్మికులను రక్షించడం దీని లక్ష్యం. తనిఖీ బృందాలు ఆకస్మిక సందర్శనలు నిర్వహిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ చొరవ అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com