సౌదీ విమానాశ్రయాలలో 15శాతం పెరిగిన ప్రయాణీకులు..!!

- May 19, 2025 , by Maagulf
సౌదీ విమానాశ్రయాలలో 15శాతం పెరిగిన ప్రయాణీకులు..!!

రియాద్: 2024 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాల ద్వారా ప్రయాణించిన మొత్తం వ్యక్తుల సంఖ్య 128 మిలియన్లను దాటింది. ఈ సంఖ్య మునుపటి సంవత్సరంతో పోలిస్తే 15 శాతం అధికం. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ఆదివారం ప్రచురించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స్టాటిస్టిక్స్ పబ్లికేషన్ 2024 ప్రకారంజ.. 2023తో పోలిస్తే గత సంవత్సరం కింగ్‌డమ్ విమానాశ్రయాలలో ప్రయాణీకులు, ఎయిర్ కార్గో ట్రాఫిక్ రెండింటిలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది.

అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 69 మిలియన్లను అధిగమించింది.  ఇది 2023 నుండి 14 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అయితే దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 59 మిలియన్ల మార్క్ (16శాతం వృద్ధి) దాటింది.  కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకుల సంఖ్య పరంగా అగ్రస్థానంలో ఉంది. 14 శాతం వృద్ధి రేటుతో దాదాపు 49 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. తరువాత రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 18 శాతం పెరుగుదలతో 37.6 మిలియన్ల మంది ప్రయాణికులను ఆహ్వానించింది. కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడవ స్థానంలో నిలిచింది. 12.8 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. కింగ్‌డమ్ విమానాశ్రయాలలో దేశీయ విమాన ప్రయాణీకుల సగటు రోజువారీ సంఖ్య సుమారు 162,000 కు చేరుకుంది. అంతర్జాతీయ విమానాల సగటు సంఖ్య దాదాపు 189,000 గా ఉంది.

ఎయిర్ కార్గో విషయానికొస్తే,.. 2024 లో మొత్తం కార్గో వాల్యూమ్‌లు 1.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది 2023 తో పోలిస్తే 34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మార్చి నెలలో కార్గో ట్రాఫిక్‌కు గరిష్ట నెలగా నిలిచింది. మొత్తం 123,000 టన్నుల కార్గో వాల్యూమ్‌ నమోదైంది. ఇందులో 64,000 టన్నుల అవుట్‌బౌండ్ కార్గో, 720,000 టన్నుల ఇన్‌బౌండ్ కార్గో తపాటు 407,000 టన్నుల ట్రాన్సిట్ కార్గో ఉంది. కింగ్‌డమ్ ఫ్లీట్‌లో మొత్తం విమానాల సంఖ్య 361 కి చేరుకుంది. ఇది 2023 తో పోలిస్తే 11 శాతం పెరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com