మంటల్లో చైనా డ్రైవర్‌లెస్ కారు.. అబుదాబిలో ప్రాజెక్టుపై ప్రభావం ఉంటుందా..?
- May 19, 2025
యూఏఈ: అబుదాబిలో చైనా డ్రైవర్ లెస్ కార్ల ప్రాజెక్టుపై ఇటీవల బీజింగ్ లో జరిగిన ప్రమాదం ఎటువంటి ప్రభావం చూపదని చైనా అటానమస్ వెహికల్ టెక్నాలజీ కంపెనీ Pony.ai తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్‌తో తమ సహకారాన్ని ఈ సంఘటన ప్రభావితం చేయదని కంపెనీ స్పష్టం చేసింది.
మే 13న బీజింగ్‌లోని ఆగ్నేయ శివారులోని డాక్సింగ్ జిల్లాలోని యిజువాంగ్ పట్టణంలో Pony.ai సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ వాహనం మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేరని చైనా, యూరప్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం అంతటా పనిచేస్తున్న Pony.ai తెలిపింది.
అక్టోబర్ 2023లో గిటెక్స్ గ్లోబల్ సందర్భంగా మస్దార్ నగరంలో ఉన్న అబుదాబి స్మార్ట్, అటానమస్ వెహికల్స్ ఇండస్ట్రీ (SAVI) క్లస్టర్‌లో చేరడానికి Pony.ai అబుదాబి స్మార్ట్ , అటానమస్ వెహికల్స్ ఇండస్ట్రీతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. పోనీ.ఐ ప్రస్తుతం బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌలో రోబోటాక్సిస్‌ను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!