సఖిర్ పర్యావరణ వ్యవస్థ రక్షణ..7,600 టన్నుల వ్యర్థాల తొలగింపు..!!

- May 19, 2025 , by Maagulf
సఖిర్ పర్యావరణ వ్యవస్థ రక్షణ..7,600 టన్నుల వ్యర్థాల తొలగింపు..!!

మనామా: ఉర్బాసర్ క్లీనింగ్ కంపెనీ సహకారంతో దక్షిణ ప్రాంత మునిసిపాలిటీ.. బహ్రెయిన్‌లోని సఖిర్ ప్రాంతం నుండి సుమారు 7,619 టన్నుల వ్యర్థాలను తొలగించింది. క్యాంపింగ్ సీజన్ ముగిసిన మూడు నెలల తర్వాత చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీ నుంచి తేలికపాటి యంత్రాలు, ట్రక్కులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. క్యాంపింగ్ మెటీరియల్, వదిలివేసిన ఫర్నిచర్, నిర్మాణ శిధిలాలను తొలగించినట్లు తెలిపారు. 

సఖిర్ అంతటా క్లీనింగ్ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వచ్చే నెల ప్రారంభం నాటికి క్యాంపెయిన్ ముగిసే అవకాశం ఉందన్నారు. ఇంకా 2,300 టన్నుల వ్యర్థాలను తొలగించాల్సి ఉందని భావిస్తున్నారు.  దాంతో మొత్తం వ్యర్థాలు 10,000 టన్నులకు చేరుకునే అవకాశం ఉందని,  గత సంవత్సరం క్యాంపింగ్ సీజన్‌తో పోలిస్తే ఇది 40% పెరుగిందని పేర్కొన్నారు.

బాప్కో ఎనర్జీస్ వంటి జాతీయ సంస్థలతో పాటు BSTS, AMA, ఎనర్ఫ్లెక్స్, NAMCO, MCSC, COMSIP, ASCON, హాలిబర్టన్ వంటి సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా క్లీన్-అప్ డ్రైవ్‌లు నిర్వహించాయని తెలిపారు.  సహజ పర్యావరణ రక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని దక్షిణ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com