స్విమ్స్ లో పేషంట్ల సహాయార్థం 'స్విమ్స్ సేవ' ప్రారంభం
- May 19, 2025
తిరుపతి: శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (SWIMS) హాస్పిటల్ ఆధ్వర్యంలో 19.05.2025వ తేది సోమవారం నుండి పేషంట్లు వారి సహాయకులకు త్వరిత గతిన సేవలు అందించాలని ఉద్దేశ్యం తో వారి సహాయార్ధం “స్విమ్స్ సేవను “ప్రారంభించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ...టి.టి.డిలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్ లో కూడా ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఐ.వి.సుబ్బారావు మరియు టి.టి.డి. చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఇ.ఓ. జె.శ్యామలరావు ఆదేశాల మేరకు స్విమ్స్ యూనివర్శిటీలో "స్విమ్స్ సేవ" ప్రారంభించినట్లు తెలిపారు.
స్విమ్స్ హాస్పిటల్ లో అందుతున్న దాదాపు 42 విభాగలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుండి రోజుకు దాదాపు 1500 మంది పేషెంట్ లు వస్తున్నారని, వీరిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వీరికి ఎక్కడ ఏ ఏ వైద్య సేవలు అందుతున్నాయో తెలియడంలేదు.
అందుకోసం పేషెంట్స్ సౌకర్యర్థం స్విమ్స్ నందు విద్యానభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఒక బ్యాచ్ కు 20 మందిని నియమించి వారిని స్విమ్స్ ఓపి.డి బ్లాక్ మరియు శ్రీ పద్మావతి ఓ.పి.డి. బ్లాక్ వద్ద పేషంట్ల ఓ.పి. రిజిస్ట్రేషన్, రక్తపరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం వచ్చే పేషంట్లకు సహాయ సహకారాలు అందిచడం కోసం ఈ సేవను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్, కాలేజ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డా.మాధవి.చీఫ్ మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ వివేకానంద్, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్స్ మురళీ, శిరీష మరియు ఇతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







