HYDRAలో డ్రైవ‌ర్ ఉద్యోగాలు...

- May 19, 2025 , by Maagulf
HYDRAలో డ్రైవ‌ర్ ఉద్యోగాలు...

హైదరాబాద్: ఇటీవల తెలంగాణలోని హైడ్రా సంస్థ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ).. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి బుధవారం (మే 19, 21) వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి స్వల్ప మార్కుల తేడాతో దూరమైన వారికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఒక్కసారిగా పోటెత్తారు. హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద పెద్డ సంఖ్యలో బారులు తీరారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు. హైడ్రా గతంలో కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో పలు నియామకాలు చేపట్టింది. 2025 ఫిబ్రవరి నెలలో డీఆర్ఎఫ్ లోకి 357 కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. ఈ ఉద్యోగులు అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వారం రోజుల శిక్షణ అనంతరం ఫీల్డ్ లోకి పంపారు.

పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయి:
మొత్తం పోస్టుల సంఖ్య : 200
అర్హతలు: తెలంగాణలో గతంలో విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఫైనల్ రాత పరీక్ష రాసి, ఎంపిక కాని అభ్యర్థులకు ప్రాధాన్యత.
ఉద్యోగం పేరు: డ్రైవర్ పోస్టులు
టెంపరరీ: ఔట్సోర్సింగ్ విధానంలో ఈ 200 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత జీతం : విడుదలైన ప్రకటనలో జీతం వివరాలు తెలుపలేదు.
సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ.


నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19th మే, 2025.
దరఖాస్తులు ఆఖరి తేదీ : 21st మే, 2025

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com