బహ్రెయిన్ లో 167 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- May 20, 2025
మనామా: మే 11 నుంచి 17 తేదీల మధ్య బహ్రెయిన్ అంతటా నిర్వహించిన తనిఖీల ఫలితాలను లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ (LMRA) ప్రకటించింది. 167 మంది ఉల్లంఘనకారులను బహిష్కరించినట్లు తెలిపింది. అదే సమయలో 14 మంది అక్రమంగా ఉంటున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నట్ల వెల్లడించింది. మొత్తంగా 1,337 తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నది. వీటిలో 1,324 వాణిజ్య సంస్థలకు వ్యక్తిగత సందర్శనలు, బహుళ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో 13 ఉమ్మడి తనిఖీ కార్యకలాపాలు ఉన్నాయి.
నాలుగు గవర్నరేట్లలో ఉమ్మడిగా ప్రచారాలు జరిగాయని, వీటిలో క్యాపిటల్ గవర్నరేట్లో ఏడు, ముహారఖ్, నార్తర్న్, సదరన్ గవర్నరేట్లలో రెండు చొప్పున తనిఖీలు ఉన్నాయి. జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోలీసు డైరెక్టరేట్లు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆయా మునిసిపాలిటీలతోపాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నాయని వివరించారు.
ఏవైనా అనుమానిత కార్మిక ఉల్లంఘనలను LMRA వెబ్సైట్ www.lmra.gov.bh ద్వారా, 17506055 కు కాల్ చేయడం ద్వారా లేదా తవాసుల్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







