'థగ్ లైఫ్' నుంచి సెకండ్ సింగిల్ షుగర్ బేబీ రిలీజ్
- May 21, 2025
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా "Thug Life" లోని మ్యూజికల్ యూనివర్స్ మరింత స్వీట్ గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సింగిల్ "షుగర్ బేబీ" రిలీజ్ అయ్యింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టింది.
స్లిజీ చార్మ్ తో పాటు, అదిరిపోయే వైబ్ తో ఈ పాట, రిథమ్, అటిట్యూడ్ బ్లెండ్ తో ఓ బోల్డ్ కాక్‌టెయిల్‌లా ఆకట్టుకుంటోంది. రెహమాన్ సంగీతం మ్యాజికల్ గా వుంది. సాఫ్ట్, మెలోడిక్ బీట్స్ కట్టిపడేసింది.
అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ వోకల్స్ తో సాంగ్ ని మరింత లైవ్లీగా మార్చారు. ఒక్కో సింగర్ వారి స్వంత వాయిస్ టెక్స్చర్‌తో పాటకు ప్రత్యేక ఫ్లేవర్‌ను ఇచ్చారు. ఆనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం అదిరిపోయింది. లిరిక్స్ మనసులో నిలిచిపోయేలా వున్నాయి.
త్రిషా కృష్ణన్ మెస్మరైజింగ్ బ్యూటీతో కనువిందు చేసింది. ఆమె లుక్స్, గ్రేస్, అన్నీ కలసి తెరపై మ్యాజిక్ ని సృష్టించాయి. రవికే చంద్రన్ అందించిన విజువల్ ఎస్టెటిక్ టచ్‌తో ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్ గా కనిపిస్తోంది.
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్. సుధాకర్ రెడ్డి గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







