మహిళలకు APSRTC శుభవార్త..
- February 10, 2026
విజయవాడ: ఏపీలోని కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలు ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారు. తాజాగా మహిళలకు ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చంది.
ఈ నెల 15న మహాశివరాత్రి. భక్తులు శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేసింది. శివరాత్రి స్పెషల్ సర్వీసులకు కూడా స్త్రీ శక్తి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు వెళ్లే భక్తుల కోసం 618 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా 2వేల మంది సిబ్బందిని నియమించారు. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, చీరాల డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. అంతేకాదు పెట్లూరివారిపాలెం దగ్గర ప్రత్యేకంగా ఆర్టీసీ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇక ఈ స్పెషల్ సర్వీసుల్లో టికెట్ రేట్ల గురించి వివరాలు తెలిపారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండకు 30 రూపాయలు, కొండ దిగువ నుంచి పైకి 25 రూపాయలుగా ఛార్జీ నిర్ణయించారు. మహిళలు మాత్రం ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







