మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- February 10, 2026
సైబరాబాద్: మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంబంధించి ఈరోజు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఎన్ఆర్ కన్వెన్షన్ లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్, ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వర్తించే సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల్లోని డబిల్ పూర్ డిస్ట్రిబ్యూషన్ & కౌంటింగ్ కేంద్రాన్ని, డబిల్ పూర్ లోని ఎన్నికలు జరిగే కేంద్రాలను తనిఖీ చేశారు.
ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు, పోలైన బ్యాలట్ బాక్సులు/ఈవీఎంలను సెక్టార్ మేజిస్ట్రేట్ స్వీకరించే వరకూ విధి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలలో పురుషులు, మహిళల కోసం వేర్వేరు క్యూలను సక్రమంగా ఏర్పాటు చేసి, ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెల్ ఫోన్లు, నీటి బాటిళ్లు, ఇంక్ బాటిళ్లు లేదా ఎలాంటి దహనశీల పదార్థాలు పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించరాదన్నారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. అలాగే రూట్ మొబైల్ ఆఫీసర్, QRT, SST, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, చట్టం, శాంతిభద్రతలకు సంబంధించిన ఏ పరిస్థితి ఏర్పడినా వెంటనే రూట్ మొబైల్ ఆఫీసర్‌కు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాల్సిందిగా తెలిపారు. అదేవిధంగా, నిషేధాజ్ఞలు (సెక్షన్ 163), మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి కుత్బుల్లాపూర్ ఇన్చార్జి డిసిపి సాయి మనోహర్, కుత్బుల్లాపూర్ ఏడీసీపీ పురుషోత్తమ, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







