భారత్ కు పాక్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు
- May 22, 2025
న్యూ ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులు దాడులు చేసి నేటమట్టం చేశాయి. ఈ ఘటనపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్ పై పగ పెంచుకుంది. కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ లతో దాడులకు దిగింది. అయితే ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదరడంతో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.
భారత్ కు ఆర్థికంగా నష్టం
ఈ క్రమంలో భారత్ కు పాకిస్థాన్ మరో షాక్ ఇచ్చింది. అయితే గతంలో భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పాక్ గగనతలం నుంచి భారత్ విమానాలు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్. అయితే ఈ నిర్ణయాన్ని తాజాగా మరో నెల రోజులపాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భారత్ కు ఆర్థికంగా నష్టంగా భావించవచ్చు.
రోజులపాటు పొడిగిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలం నుంచి వెళ్లకుండా పాకిస్థాన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని మరో నెల రోజులపాటు పొడిగిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిషేధానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది.
రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకారం..
అయితే అంతర్జాతీయ వైమానిక సంస్థ(ICAO) రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకారం ఒక దేశం.. మరో దేశానికి విధించే గగనతలం ఆంక్షలు ఒకేసారి నెల రోజులు కంటే ఎక్కువ కాలం విధించరాదు. పాకిస్థాన్ గతంలో విధించిన ఈ నిషేధం మే 23 వరకు అమల్లో ఉంటుంది. ఆలోపు ఈ నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ పలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ రద్దు..ఇలా అనేక నిర్ణయాలు తీసుకుంది.దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే భారత్ పై ప్రతీకారంగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!