IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- April 03, 2026
ఐపీఎల్ 2026 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ బోణీ కొట్టింది.ఈ సీజన్ లో తొలి విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయదుంధుబి మోగించింది.కోల్ కతాను 65 రన్స్ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. 227 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్..161 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 29 బంతుల్లో 52 రన్స్ చేశాడు. రింకు సింగ్ (35), అలెన్ (28) మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగాడు. మలింగ, నితీశ్ చెరో రెండు వికెట్లు తీశారు. దూబె ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది తొలి విజయం కాగా, కోల్ కతాకు వరుసగా రెండో పరాజయం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







