డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- April 02, 2026
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ చివరి ఏడాది.. ఎంటెక్, ఎంసీఏ, ఎంకాం, ఎంఏ, ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు ప్రతి నెలా రూ.9 వేలు పొందే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంతకీ ఇది ఏ పథకం అంటే.. ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కాలర్షిప్ పథకం’. దీనికి ఎంపికైన విద్యార్థులు ప్రతి నెల రూ.9 వేల స్కాలర్షిప్ పొందవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు తెలిపారు.
ముఖ్య నిబంధనలు, అర్హతలు:
- ఏజ్ లిమిట్: 18-25 ఏళ్ల లోపు విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
- విద్యార్హత: తప్పనిసరిగా పది, ఇంటర్/ఐటీఐ/పాలిటెక్నిక్ పూర్తిచేసుకుని.. డిగ్రీ చదువుతున్న వారు అర్హులు.
- చివరి ఏడాది విద్యార్థులు మాత్రమే: డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- కోర్సులు: బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ కోర్సులతో పాటు బీఫార్మసీ, బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు.
- స్కాలర్షిప్: ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.9 వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు.
- కుటుంబ ఆదాయం: విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షలలోపు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
- సహాయం కోసం: మరిన్ని వివరాలకు ఫోన్ నెంబరు 1800116090 సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







