యూఎస్ వెళ్ళే పౌరులకి బహ్రెయిన్, యూఏఈ హెచ్చరిక
- July 11, 2016
అమెరికాకి వెళ్ళే తమ పౌరులకు బహ్రెయిన్, యూఏఈ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాలో నల్లజాతీయుల దాడులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళే పౌరులు అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్, యూఏఈ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. వాషింగ్టన్‌లోని యూఏఈ ఎంబసీ 'స్పెషల్ అలర్ట్'ని జారీ చేసింది. ఆందోళనా కార్యక్రమాలకు తమ పౌరులు దూరంగా ఉండాలని ఈ అలర్ట్‌లో పేర్కొన్నారు. బహ్రెయిన్, ట్విట్టర్ ద్వారా తమ పౌరులను అలర్ట్ చేసింది. ఆందోళనలు, ప్రదర్శనలు, అలాగే ఎక్కువమంది గుమికూడే ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్ తన పౌరులకు సూచించింది. 37 ఏళ్ళ నల్లజాతీయుడు అల్టన్ స్టెర్లింగ్ ఓ పోలీస్ చేతిలో బాటన్ రోగ్, లూసియానాలో చనిపోయాక అమెరికాలో అల్లర్లు పెరిగాయి. ఫిలాండో కాస్టిల్‌లోని మిన్నెసోటాలో పనిచేస్తున్న ఓ నల్లజాతి యువకుడ్ని సైతం పోలీసులు కాల్చి చంపడంతో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







