హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 20 మంది కంటెస్టెంట్స్
- May 23, 2025
హైదరాబాద్:72వ మిస్ వరల్డ్ పోటీల్లో తాజాగా మరో కీలక దశను చేరుకుంది. నిన్న తొలిరౌండ్ విజయవంతమైంది. తర్వాత, హెట్టుహెడ్ చాలెంజ్‌కు ఎంపికైన టాప్ 20 ఫైనలిస్టుల జాబితాను తాజాగా ప్రకటించారు. 107 మంది పోటీ దారులు ఈ పోటీలో పాల్గొన్నారు. వారు తమ వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ, మానసిక ఆరోగ్యం, మహిళల సాధికారత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక విషయాలపై ఆత్మవిశ్వాసంగా ప్రసంగించారు. ఈ మాటల పోరులో ప్రతిభ, ఆలోచనల స్పష్టత, సమాజం పట్ల ఉన్న బాధ్యతను దృష్టిలో పెట్టుకుని బెస్ట్ 20 మంది ఎంపికయ్యారు. ఇందులో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు అవకాశం దక్కలేదు. ఇవాళ జరిగే తుది రౌండ్ , ఎంపికైన 20 మంది ఫైనలిస్టులకు మరోసారి తమ సామాజిక దృక్పథాన్ని ప్రదర్శించే అవకాశం లభించనుంది. విజేతను ఎంపిక చేయడంలో అభిప్రాయాలు స్పష్టత, సామాజిక బాధ్యతపై ఉన్న నిబద్ధత, వ్యక్తిగత అంకితభావం కీలక ప్రమాణాలుగా ఉపయోగించనున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







