యూఏఈలో ‘మే’ రికార్డులు..51.6°Cకి ఉష్ణోగ్రతలు..!!

- May 25, 2025 , by Maagulf
యూఏఈలో ‘మే’ రికార్డులు..51.6°Cకి ఉష్ణోగ్రతలు..!!

యూఏఈ: యూఏఈలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్ ఐన్ లోని స్వీహాన్ వద్ద శనివారం మధ్యాహ్నం 1:45 గంటలకు అత్యధిక ఉష్ణోగ్రత 51.6°Cగా నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది. ఈ తీవ్రమైన వేసవి సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఒకటని తెలిపింది. ఇది రాబోయే నెలల్లో తీవ్రమైన వేసవి వేడికి ముందస్తు ప్రారంభాన్ని సూచిస్తుందని తెలిపారు. మే 23న 50.4ºC ఉష్ణోగ్రత నమోదైంది. గత నెలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 42.6ºC నమోదై రికార్డు సృష్టించింది. 2017 ఏప్రిల్‌లో నమోదైన 42.2ºC సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతను ఇది అధిగమించిందని NCM తెలిపింది.
సాధారణంగా జూన్ 21న వేసవి కాలం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, వేసవి కాలం ముందు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత సంవత్సరం జూలైలో స్వీహాన్‌లో గరిష్టంగా 50.8°C నమోదైందని DAG ఆపరేషన్స్ మేనేజర్ ఖదీజా అల్ హరిరి తెలిపారు. 
ఇదిలా ఉండగా, ఉష్ణోగ్రతలు 50°C దాటినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com