శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..
- May 25, 2025
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం ఒకటి. కొలిచే వారి కొంగుబంగారం శ్రీశైలం మల్లన్న. నిత్యం భక్తులతో ఈ ప్రాంతం శివనామ స్మరణలతో మారుమోగిపోతుంది. తాజాగా.. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో ఇకపై శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఆ మూడ్రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్‌లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్‌లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు.
ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవల ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, వసతి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించేందుకు వైదిక కమిటీ, అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







