బాగ్దాద్‌లో ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ ల మినీ ఒలింపిక్ ఆటల పోటీలు
- July 11, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇటీవలే బాంబులతో మారణహోమం సృష్టించిన ఐసిస్ టెర్రరిస్టులు ప్రజలను ఆకర్షించేందుకు మరో కొత్త అవతారం ఎత్తారు. తమలో కరుడుగట్టిన కాఠిన్యంతోపాటు క్రీడాస్ఫూర్తి కూడా ఉందని నిరూపించుకునేందుకు మినీ జిహాదీ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. జిహాదీల మధ్య 'టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చెయిర్స్' లాంటి ఆటల పోటీలను నిర్వహించారు.ఇరాక్‌లోని తమ ఆధీనంలోని తల్ అఫర్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పిల్లలకు గాలి బుడగలు ఊదడం లాంటి పోటీలు కూడా నిర్వహించారు. విజేతలందరికి పోటీల తర్వత స్వీటు ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ పోటీల్లో ఐదేళ్ల బాలలు కూడా పాల్గొనడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనాలంటూ స్థానిక ప్రజలను ప్రోత్సహించారు. స్థానికుల్లో పిల్లలు తప్ప పెద్దలెవరూ హాజరు కాకపోయినా, వారంతా వచ్చి జీహాదిల మధ్య జరిగిన పోటీలను ప్రోత్సహించారు. జీహాదీలు బ్రిటిష్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల షర్టులను ధరించి మరీ పోటీల్లో పాల్గొన్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో తమ ఆధీనంలోని నగరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చాటుకునేందుకే ఈ ఆటల పోటీలను నిర్వహించారని స్థానిక ప్రజలు వ్యాఖ్యానించారు. ఐసిస్ టెర్రరిస్టుల ట్విట్టర్ వినియోగం గత రెండేళ్లలో 45 శాతం తగ్గిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే జీహాదీ ఒలింపిక్స్ పోటీలకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో పోస్ట్ అయ్యాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







