ముసానెద్లో గృహ కార్మికుల కోసం ‘CV అప్లోడ్’ సర్వీస్: సౌదీ అరేబియా
- May 26, 2025
రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముసానెద్ ప్లాట్‌ఫామ్ ద్వారా గృహ కార్మికుల కోసం “CV అప్లోడ్” సేవను ప్రారంభించింది. ఇది యజమానులు కార్మికుడి సేవను మరొక యజమానికి బదిలీ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఈ సేవ వారి రెజ్యూమ్ ఆధారంగా కార్మికుల ఎంపికను సులభతరం చేయడానికి, సేవలను సజావుగా క్రమబద్ధంగా బదిలీ చేయడానికి రూపొందించబడిన ఒక వినూత్న నమూనా అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ గా పనిచేస్తుందన్నారు.
ముసానెద్ ద్వారా గృహ కార్మికులు వారి ప్రస్తుత యజమానితో వారి ఒప్పందం ముగిసిన తర్వాత వారి CVలను అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేయబడిన CVలలో ఉద్యోగ టైటిల్స్, అనుభవం వంటి వివరాలు ఉంటాయి. కాబోయే యజమానులు నైపుణ్యాలు, ఉద్యోగ అవసరాల ఆధారంగా అభ్యర్థులను వెతకడానికి, సమర్థులను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ చర్య కార్మికులు, యజమానుల హక్కులను కాపాడటానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







