అబుదాబిలో అక్రమ బిల్‌బోర్డ్‌లు, సైనేజ్‌లు: Dh8,000 వరకు జరిమానాలు..!!
- May 26, 2025
యూఏఈ: అబుదాబి అధికారులు ఎమిరేట్‌లో ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా బిల్‌బోర్డ్‌లు, సైనేజ్‌లను ఉంచాలని స్పష్టం చేశారు. లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పునరావృత నేరాలకు జరిమానాలు అధికం అవుతాయని సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ పోస్ట్‌లో అబుదాబి DMT చట్టంలోని ఆర్టికల్ 66ని ప్రకారం.. పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్‌తో ప్రకటనలను ఉపయోగించడం చేస్తే.. మొదటి నేరానికి 2,000 దిర్హామ్‌ల జరిమానా; రెండవ నేరానికి 4,000 దిర్హామ్‌ల జరిమానా; మూడవ నేరానికి 8,000 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్‌తో బిల్‌బోర్డ్‌ను ఉపయోగించడం మొదటి, రెండవ, తదుపరి నేరస్థులకు 2000 దిర్హామ్‌ల, 4,000, 8,000 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







