ఆరుబయట చెత్తను పెడితే.. BD300 జరిమానా..!!

- May 26, 2025 , by Maagulf
ఆరుబయట చెత్తను పెడితే.. BD300 జరిమానా..!!

మనామా: ఇళ్ల బయట బిన్ బ్యాగులను వదిలేస్తే.. ఉత్తర మునిసిపాలిటీ కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు పాటించకుండా చెత్తను ఇంటి బయట వదిలేస్తే BD300 వరకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇళ్ల ముందు నేరుగా ఉంచే వ్యర్థాలను సేకరించడం మునిసిపాలిటీ ఆపివేసింది. అదే సమయంలో నిర్దేశిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు, బారెల్స్‌ను ఉపయోగించమని నివాసితులకు సూచించింది.

ప్రజా పరిశుభ్రత చట్టం ప్రకారం, వ్యర్థాలను సరైన మూతలు ఉన్న కంటైనర్లలో నిల్వ చేయాలి . దానిని వేరే చోట వదిలివేయడం నేరం. జరిమానాలు BD50 నుండి ప్రారంభమవుతాయి. ఉల్లంఘన స్వభావాన్ని బట్టి BD300 వరకు పెరగవచ్చు. రాంలి హౌసింగ్ ప్రాంతంలో  గృహ వ్యర్థాలను రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే బయటకు తీయాలని పేర్కొంటూ ఆయా అపార్టుమెంట్ల వద్ద నోటీసులు అతికించారు.  ఇళ్ళు, కార్యాలయాలు, దుకాణాలు, కర్మాగారాలు, ఇతర సంస్థలతో సహా అన్ని రకాల ప్రాంగణాలకు ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యర్థాలను కవర్ చేసిన కంటైనర్లలోనే నిల్వ చేయాలి.వాటిని పబ్లిక్ ప్లేసులకు దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com