యాత్రికులలో ఎటువంటి అంటువ్యాధి కేసులు లేవు: అల్-జలాజెల్

- May 27, 2025 , by Maagulf
యాత్రికులలో ఎటువంటి అంటువ్యాధి కేసులు లేవు: అల్-జలాజెల్

మక్కా: ఇప్పటివరకు యాత్రికులలో ఎటువంటి అంటువ్యాధి కేసులు నమోదు కాలేదని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ స్పష్టం చేశారు. 2025 హజ్ సీజన్ కోసం కేటాయించిన పడకల సామర్థ్యాన్ని గత సంవత్సరంతో పోలిస్తే 60 శాతం పెంచినట్లు ఆయన తెలిపారు. యాత్రికులు నివారణ చర్యలు పాటించడం, అధికారుల సూచనల ప్రకారం మాస్కులు ధరించడం గురించిన ప్రాముఖ్యతను మంత్రి హైలైట్ చేశారు. ఏదైనా అనారోగ్య పరిస్థితిలో సహాయం కోరడానికి వెనుకాడవద్దని ఆయన యాత్రికులను కోరారు. ఈ సంవత్సరం హజ్ కోసం మంత్రిత్వ శాఖ సన్నాహాలను ఆయన సమీక్షించారు. "మక్కా రూట్" ఇనిషియేటివ్ ద్వారా మొదటి బ్యాచ్ యాత్రికుల రాకతో మంత్రిత్వ శాఖ సేవలు ఏకకాలంలో ప్రారంభమయ్యాయని వివరించారు.
మినాలో 200 పడకల సామర్థ్యంతో కొత్త అత్యవసర ఆసుపత్రిని స్థాపించినట్లు అల్-జలాజెల్ చెప్పారు. 14 ఓడరేవులలో యాత్రికులకు 50,000 కంటే ఎక్కువ ఆరోగ్య సేవలు అందించినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 1,200 పడకల సామర్థ్యం కలిగిన మూడు ఫీల్డ్ ఆసుపత్రులను రక్షణ మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. SEHA యాప్ యాత్రికులకు ఆసుపత్రులకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వారి నివాసాల వద్ద వైద్య సేవలు, సంప్రదింపులను అందిస్తుందని ఆయన వివరించారు.అత్యవసర కేసులను పరిష్కరించే ప్రయత్నాలకు సంబంధించి 900 అంబులెన్స్‌లతో పాటు అత్యవసర కేసుల కోసం 11 ఎయిర్ ఎవాక్యుయేషన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు,  7,500 కంటే ఎక్కువ పారామెడిక్స్‌తో కూడిన 71 ప్రథమ చికిత్స కేంద్రాలు అందుబాటులో పెట్టినట్టు అల్-జలాజెల్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com