షార్జాలో ప్రభుత్వ రంగానికి 4 రోజులపాటు సెలవులు..!!
- May 29, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాకు నాలుగు రోజులపాటు ప్రభుత్వ సెలవులను షార్జా ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 5, అరాఫా దినోత్సవం నుండి ప్రారంభమై జూన్ 8 వరకు కొనసాగుతుంది. షిఫ్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. జూన్ 9 నుండి అధికారిక పనివేళలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించారు. షార్జా ప్రభుత్వ విభాగాలు, అధికారులు, సంస్థలలో పనిచేసే వారికి ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఈద్ అల్ అధాకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించింది. జుల్ హిజ్జా 9 నుండి జుల్ హిజ్జా 12 వరకు దేశం సెలవుదినాన్ని పాటిస్తుందని అథారిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మే 27 సాయంత్రం జుల్ హిజ్జా నెలవంక కనిపించిన తర్వాత, జూన్ 6 నాడు యూఏఈ ఈద్ అల్ అధాను జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







