సౌదీ అరేబియాలో భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం..వివిధ అంశాలపై సమీక్ష..!!
- May 29, 2025
రియాద్: భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు అదెల్ అల్-జుబేర్ వారికి ఘన స్వాగతం పలికారు. భారత పార్లమెంట్ మెంబర్ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం సౌదీ అరేబియాకు వచ్చింది. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించడంతో పాటు, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం మూడు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనుంది. సరిహద్దు ఉగ్రవాద సమస్యను, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ గురించిన విషయాలన్ని వెల్లడించేందుకు సౌదీ అరేబియా దేశ ప్రతినిధులకు వివరించనున్నారు.
భారత ప్రతినిధి బృందంలో పార్లమెంట్ సభ్యులు నిషికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ, అసదుద్దీన్ ఒవైసీ, సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, భారత మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లా ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







